శరీర నిర్మాణంలో కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపముంటే ఈ ఏడు హెల్తీ ఫుడ్స్ తప్పకుండా డైట్‌లో ఉండాలి.
పాలు కాల్షియంకు కేరాఫ్ అని చెప్పవచ్చు. పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కాల్షియం లోపాన్ని దూరం చేసేందుకు సహాయపడుతుంది.
కాల్షియం లోపాన్ని దూరం చేయడంలో అంజీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియంతో పాటు పొటాషియం, విటమిన్ బి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.
రోజూ బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కాల్షియం లోపం దూరమవుతుంది.
చీజ్ తింటే శరీరంలో కాల్షియం లోపం తలెత్తదు. పాలు తాగడం ఇష్టం లేకపోతే చీజ్ రూపంలో కాల్షియం లోపాన్ని సరిచేయవచ్చు.
ఆరెంజ్ జ్యూస్‌లో కాల్షియం, విటమిన్ సి రెండూ సమృద్ధిగా ఉంటాయి. రోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
కూరగాయల్లో బ్రోకలీ కాల్షియంకు మంచి సోర్స్. వారానికి కనీసం రెండుసార్లు బ్రోకలీ తినడం వల్ల కాల్షియం లోపం తలెత్తదు
చేపల్లో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా సీ ఫిష్ చాలా మంచివి.