ఎన్నో అనారోగ్యాలను నయం చేసే సూపర్ఫుడ్లుగా వివిధ రకాల చిరుధాన్యాలు ఇటీవల కాలంలో గొప్ప ప్రజాదరణ పొందుతున్నాయి.
అలాంటి చిరుధాన్యాలలో సజ్జలకు ప్రత్యేక స్థానం ఉంది. సజ్జలలో ఫైబర్స్, సూక్ష్మపోషకాలు, విటమిన్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి సజ్జలతో చేసిన దోశ తింటే సర్వరోగాలు మాయం అంటున్నారు వైద్య నిపుణులు.
బాలింతలు, గర్భిణీ స్త్రీలు, శిశువులు, వృద్ధులు.. అందరూ కూడా చిరుధాన్యాలలో ఎంతో ముఖ్యమైన చోటు ఉన్న సజ్జలతో చేసిన దోశ తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారంట. మరి ఈ తయారీ విధానం ఎలానో ఒకసారి చూద్దాం.
ముందుగా ఒక పెద్ద గిన్నెలో బియ్యం, సజ్జలు వేసి కడగాలి. మరొక గిన్నెలో మినపపప్పును తీసుకొని కడగాలి.
ఒక గిన్నెలో బియ్యం సజ్జలు నాన్న పెట్టగా మరొక గిన్నెలో మినప్పప్పును కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి.
నానబెట్టిన అనంతరం వీటన్నిటిని గ్రెండర్లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
ఆ తరువాత రుబ్బుకున్న పిండిని తీసి ఏదైనా వెచ్చని ప్రదేశంలో కొన్ని గంటలపాటు పులియబెట్టాలి.ఇక పులియబెట్టిన పిండితో ఎంచక్కా సజ్జ దశ వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినట్లుగా మీరు ఉప్పు కలుపుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇక ఈ రుచికరమైన దోసని మీకు ఇష్టమైన చట్నీతో తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.