తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.
తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.
పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.
పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్..
ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా సత్యభామ సినిమాతో పలకరించింది. త్వరలో భారతీయుడు 3 మూవీతో పలకరించబోతుంది.
తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ . ఇపుడు ఆయనతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.