గ్లామర్ రోల్స్ కాకుండా తమ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు.
అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవరే సుబ్రహ్మణ్యం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
ఇక ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ముఖ్యంగా ఈ సినిమాలోని చిత్ర పాత్ర ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత ఎన్నో తెలుగు చిత్రాలలో నటించింది ఈ హీరోయిన్.
అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావటం లేదు.
ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా మాక్సీ పైన కోట్ వేసుకొని రీతు వర్మ ఇచ్చిన స్టిల్స్ అందరిని ప్రేమలో పడేస్తున్నాయి