ఆదిపురుష్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్' . రామాయణాన్ని పూర్తిగా వక్రీకరంచి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
శ్రీరామరాజ్యం బాపు చివరి సారి దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
రామాయణం.. గుణ శేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'రామాయణం'. అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
బాపు సంపూర్ణ రామాయణం.. శోభన్ బాబు, చంద్రకళ సీతారామ చంద్రులుగా నటించిన సినిమా 'సంపూర్ణ రామాయణం'. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తర్వాత శ్రీరాముడి పాత్రలో మెప్పించిన ఘనత శోభన్ బాబుకే దక్కుతోంది.
సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామారావు రావణ బ్రహ్మ పాత్రలో నటించారు. ఈ సినిమాలో వచ్చే సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.
వీరాంజయ : కాంతారావు తెలుగు సినిమా తొలి తరం హీరోల్లో ఒకరు. ఈయన శ్రీరామచంద్రుడిగా వీరాంజనేయ సినిమాలో నటించారు.
శ్రీరామ పాదుకా పట్టాభిషేకం' శ్రీరామకథతో తెలుగులో వచ్చిన ఫస్ట్ మూవీ 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ ఫస్ట్ టైమ్ రాములోరి పాత్రలో అలరించారు.
లవకుశ తెలుగులో ఎవర్ గ్రీన్ పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ 'లవకుశ' ఒకటి. సి.పుల్లయ్య, సి.ఎస్.రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రామాయణంలోని ఉత్తర కాండ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.