రాగి పిండి - 1 కప్పు, పెరుగు - 1 కప్పు, నీళ్ళు - 3 కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - 1 టీస్పూన్, పచ్చి మిరపకాయలు - 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు - ఒక రెమ్మ, పుదీనా - ఒక రెమ్మ (సన్నగా తరిగినవి)
ముందుగా ఈ రాగి అంబలిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో రాగి పిండి, ఉప్పు వేసి కలపి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, ముద్దలు లేకుండా పలుచగా కలిపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి, 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది.
నానబెట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి, పెరుగు, జీలకర్ర, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలపాలి.
రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి ఈ మిశ్రమాన్ని కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 6-8 గంటల పాటు పులియబెట్టాలి.
ఆ తర్వాత 15 నిమిషాల పాటు మరగపెట్టి పులిసిన రాగి అంబలిని గ్లాసులో పోసి, చల్లగా తాగాలి.
రాగి పిండిని నానబెట్టేటప్పుడు, గోరువెచ్చని నీళ్ళు వాడండి. ఇలా చేస్తే మరింత టేస్టిగా ఉంటుంది.
రాగి అంబలిని పులియబెట్టేటప్పుడు, ఒక మూతతో మూసి, వెచ్చని ప్రదేశంలో ఉంచండి.