పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహారాలు.. మీ ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా ఈ సమయంలో ప్రాసెస్డ్, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల గ్యాస్, కరుపు నొప్పి, అస్వస్థత వస్తాయి అని అంటున్నారు వైద్య నిపుణులు.
చాలామంది పీరియడ్స్ అప్పుడు తీపు తినడానికి ఇష్టపడతారు. అయితే చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు పీరియడ్స్ సమయంలో సమస్యలను పెంచుతాయి.
ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్.. అంటే మనకు షాపుల్లో దొరికే ఆహారం.. తినడం వల్ల హార్మోన్లు డిస్బాలెన్స్ అవుతాయట.ఇది గ్యాస్ ప్రాబ్లం పెంచి.. క్రమంగా పీరియడ్ నొప్పి పెరగడానికి దారితీస్తుంది.
అందుకే ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర లేని ఆహారం తినడం ద్వారా మీరు పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు.
తాజా పండ్లు, కూరగాయలు, నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా.. పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.