మధుమేహం రోగులకు ఇవి నిజంగా ఓ అద్భుతమైన దివ్యౌషధమని చెప్పాలి. అమోఘమైన ప్రయోజనాలు కలిగున్నాయి.
బ్లాక్ సోయాబీన్ కొండ ప్రాంతాల్లోనే లభిస్తాయి. పోషక పదార్ధాలకు కేరాఫ్ ఇవి.
బ్లాక్ సోయాబీన్స్ ఎక్కువగా గిరిజనులు ఉపయోగిస్తుంటారు. అందుకే వీటిని హిల్ ఫుడ్ అంటారు
బ్లాక్ సోయాబీన్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కండరాల పటిష్టత, శరీర ఎదుగుదలకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య పోతుంది. ప్రేవుల ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే..ఇవి అద్భుతంగా నియంత్రించగలుగుతాయి.
ఇందులో ఉండే ఖనిజాలు, ప్రోటీన్, ఇతర పోషకాల కారణంగా మధుమేహం నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది.