బాదం పప్పులు - 10, జీడిపప్పు - 10, పిస్తా పలుకులు - 8, ఖర్జూరాలు -8( విత్తనాలు తీసినవి ), కుంకుమపువ్వు - చిటికెడు
పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక బౌల్లోకి వేసి అందులో నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి.
రాత్రంతా నానిన ఈ విత్తనాలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి, అందులో రెండు కప్పుల పాలు, ఒక అరటిపండు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) వేసి జ్యూస్ లాగా తయారు చేయాలి.
అలా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ పై దాల్చిన చెక్క పౌడర్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి.
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ తాగితే రోగాలన్నీ పరార్.
ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులు తగ్గడమే కాదు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.