గ్లోయింగ్ స్కిన్ కోసం ఇప్పుడు చెప్పబోయే ఒక హెల్తీ డ్రింక్ తాగితే..ముఖం అందంగా కనిపించడమే కాదు నునుపుగా ప్రకాశవంతంగా తయారవుతుంది.
మెరిసే చర్మం కావాలంటే హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవాలి ఈ డ్రింక్ కావాల్సిన పదార్థాలు.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె.
పైన చెప్పిన పదార్థాలు అన్నిటిని ఒక గాజు సీసాలోకి వేసి, పైన మూత పెట్టి బాగా షేక్ చేయాలి.
అంతే.. ఇలా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే డైట్ లో భాగంగా తాగినట్లయితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
ఇలా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ ని మీరు రోజు లేదా వారానికి రెండుసార్లు తాగితే చక్కటి ఫలితాలు కలుగుతాయి.
ఈ జ్యూస్ వల్ల శరీరంలో మలినాలు తొలగిపోయి, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.