నరేంద్ర మోడీ ఈ మధ్య ఒక ప్రసంగంలో.. బ్లాక్ రైస్ ని సూపర్ ఫుడ్ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇందులో ఉన్న అంతటి సూపర్ ఔషధ గుణాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
వంద గ్రాముల బ్లాక్ రైస్‌లో దాదాపు 5 గ్రాముల పీచు, 12 గ్రాముల ప్రోటీన్, 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 మి.గ్రా ఐరన్ ఉంటాయి.
2017లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఈ బ్లాక్ రైస్ స్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయట. కాబట్టి షుగర్ ఉన్నవారికి ఈ రైస్ దివ్య ఔషధం.
అంతేకాకుండా ఈ రైస్ తినడం ద్వారా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే రకరకాల వ్యాధులు తగ్గపోతాయి.
ఈ బియ్యంలో అధికంగా ఉండే పీచు వల్ల.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
అంతేకాకుండా ఈ బియ్యంతో చేసిన అన్నం తినడం ద్వారా.. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
అంతేకాదు ఈ బియ్యంతో చేసిన అన్నం తినడం ద్వారా.. స్ట్రెస్ కూడా తగ్గుతుందట.