లడ్డు అంటే ఎంతో మందికి ఇష్టం. మరి అలాంటి లడ్డు..గుండె జబ్బులను దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా?
క్యారెట్ లడ్డు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని దూరం చేయడమే.. కాకుండా గుండె సమస్యలను కూడా మనకు చెరువు కాకుండా చూస్తుంది.
ఈ క్యారెట్ లడ్డు తయారీ విధానం కోసం.. ముందుగా ఒక కడాయిలో రెండు స్పూన్ల.. నెయ్యి వేడి చేసుకొని.. గుప్పెడు జీడిపప్పును, గుప్పెడు ఎండుద్రాక్షను.. వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో.. ఇంకొక స్పూను నెయ్యిని.. చేర్చి అందులో ఒక నాలుగు స్పూన్ల బొంబాయి రవ్వని.. గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
తరువాత తురుముకున్న క్యారెట్ ని కూడా అందులో వేయాలి. క్యారెట్ బాగా మగ్గనివ్వాలి.
క్యారెట్ బాగా వేగిన తరువాత రుచికి.. సరిపడినంత బెల్లం.. వేసి బాగా ఉడికించాలి. చివరిగా యాలకుల పొడి.. వేయించిన జీడిపప్పు, ద్రాక్షాను వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత.. వాటిని లడ్లు లాగా చుట్టుకోవాలి.. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డు రెడీ.