ప్రతి కిచెన్లో లభ్యమయ్యే మసాలా దినుసుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగింది లవంగం. రోజూ ఒక్కటి తీసుకుంటే చాలు ఈ అన్ని అనారోగ్య సమస్యలు బలాదూర్.
లవంగంలో ఔషధ గుణాలెక్కువ. ఆహారంలో రుచి కోసం ఎక్కువగా వినియోగిస్తారు.
లవంగంను కేవలం రుచి కోసమే కాకుండా చాలా రకాల వ్యాధుల నిర్మూలనకు ఉపయోగిస్తారు.
జలుబు దగ్గు వంటి సమస్యల్నించి సతమతమవుతుంటే రోజూ ఒక లవంగం తీసుకుంటే చాలు
రోజూ ఉదయం పరగడుపున ఒక లవంగం తీసుకుంటే నోటి నుంచి వచ్చే దుర్గంధం దూరమౌతుంది
రోజూ పరగడుపున లవంగం తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో మెటబోలిజం వృద్ధి చెందుతుంది.య దాంతో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం సమస్యలు కూడా దూరమౌతాయి
రోజూ ఉదయం వేళ పరగడుపున లవంగం తీసుకోవడం అలవాటు చేసుకుంటే మెటబోలిజం వృద్ధి కారణంగా బరువు కూడా తగ్గుతుంది
లవంగంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది.
లవంగంలో యూజెనాల్ అనే పెయిన్ కిల్లర్ గుణం ఉంటుంది. అందుకే పంటి నొప్పి వంటి సమస్యలున్నప్పుడు పంటి కింద లవంగం పెట్టుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది.
లవంగంలో కాల్షియం, మెగ్నీషియం గుణాలు ఎక్కువ. అందుకే రోజూ పరగడుపున తీసుకుంటే ఎముకలకు పటుత్వం లభిస్తుంది.