Curry Leaves Amazing Benefits: కన్పిస్తే చాలు తినేయడమే.. డయాబెటిస్ రోగులకు తిరుగులేని ఔషధం మరి
కరివేపాకు అనేది కేవలం వంటల్లో రుచి, వాసన కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది
కరివేపాకులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి.
కరివేపాకులు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దాంతో గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది
కరివేపాకుల్ని బరువు తగ్గించే ప్రక్రియలో కీలకంగా ఉపయోగిస్తారు. దీనివల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది.
కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కణజాలం మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది
కరివేపాకుల్ని వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. డయాబెటిస్ రోగులకు అయితే చాలా బాగా పనిచేస్తుంది
రోజూ ఉదయం పరగడుపు 8-10 కరివేపాకులు తినాలి. బాగా నమిలి తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. తరువాత ఓ గ్లాసు నీళ్లు తాగేయాలి
కరివేపాకు జ్యూస్ కూడా తాగవచ్చు. కరివేపాకుల్ని నూరి రసం తీయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం , తేనె కలిపి తీసుకోవాలి