మధుమేహం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్న జీవనశైలి జబ్బుగా మారిపోయింది.వయసుతో సంబంధం లేకుండా ఈ జబ్బు అందరిలోనూ కనిపిస్తోంది
డయాబెటిస్ అనేది జీవనశైలిలో మార్పుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా కొన్ని రకాల గింజలను తినడం ద్వారా మీరు ఈ జబ్బును తగ్గించుకోవచ్చు
డయాబెటిస్ రోగులకు అవిసె గింజలు అనేవి ఒకరకంగా వరం అనే చెప్పాలి.ఇవి మీ రక్తంలో ఉన్నటువంటి చక్కర శాతాన్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి.
అవిసె గింజల్లో ఉండే పోషకాలు మీ రక్తంలో ఉండే షుగర్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మీ రక్తంలో ఉండే షుగర్ ను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది
అవిసె గింజల తర్వాత మధుమేహంతో బాధపడేవారు మెంతి గింజలను ఎక్కువగా ఉపయోగించవచ్చు. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.ఇది మీ రక్తంలో ఉండే షుగర్ శాతాన్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది
మీ రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేసేందుకు మరో అద్భుతమైన పదార్థం గుమ్మడి గింజలు.గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం డయాబెటిక్ రోగులకు ఒకరకంగా వరం అని చెప్పాలి.
చియాగింజల్లో కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు మీ రక్తంలో ఉండే చక్కర శాతాన్ని కంట్రోల్ చేస్తాయి
డయాబెటిస్ రోగులు ఒక్కోసారి కొన్ని రకాల గింజల పట్ల ఎలర్జీని కలిగే ఉండే అవకాశం ఉంటుంది. అలాంటివారు తప్పనిసరిగా వైద్యుడి సలహా మేరకే గింజలను వాడాలి.