గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించే 10 ఆహర పదార్ధాలు
ఓట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ 5 వరకూ ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండానే శరీరానికి అవసరకమైన ఎనర్జీ లభిస్తుంది
లెంటిల్స్, బీన్స్ వంటి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా 30-40 వరకే ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేట్టు చేస్తాయి.
కూరగాయల్లో బ్రోకలీ, పాలకూర, కాలిఫ్లవర్ వంటి వాటి జీఐ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కావల్సిన న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి.
స్ట్రా బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివాటి గ్లైసెమిక్ ఇండెక్స్ 40 వరకే ఉంటుంది. అందుకే హెల్తీ స్నాక్ కింద్ తీసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి
సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే చిలకడ దుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ 50-60 వరకూ ఉంటుంది. మధుమేహం వ్యాధి నియంత్రణలో ఉపయోగపడుతుంది.
బార్లీ, క్వినోవా వంటి తృణ ధాన్యాల్లో గ్రైసెమిక్ ఇండెక్స్ 30-50 మధ్యలో ఉంటుంది. కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్ వంటివాటిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
సాధారణ గ్రీక్ యోగర్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ 35 ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఆపిల్, పియర్స్, పీచెస్ వంటి ఫ్రూట్స్‌లో గ్రైసెమిక్ ఇండెక్స్ 30-40 మధ్యలో ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం పెద్గగా ఉండదు.
క్యారట్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. 35-50 మాత్రమే ఉంటుంది. బ్లడ్ షుగర్ నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.