ఒకపక్క బరువు తగ్గాలి అనుకున్న.. మరోపక్క ఎంతోమందికి చాక్లెట్ తినాలి అనిపిస్తుంది.. అలాంటి వారి కోసమే రకుల్ ప్రీత్ సింగ్ కి.. ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ…
ముందుగా రెండు బాగా పండిన.. అరట్టి పండ్లను.. తీసుకోవాలి. తరువాత ఒక పాత్రలో ఈ అరటి పండ్లను వేసుకొని.. బాగా మెత్తగా నలుపు కోవాలి.
తరువాత దీనిలో ఒక కప్పు ఓట్స్ ను.. కూడా వేయాలి. తరువాత మనకి ఇష్టానుసారం.. డ్రైఫ్రూట్స్ ని అందులో చేర్చుకోవాలి.
ఒక కప్పు కోకో పౌడర్ ని, అందులో వేయాలి. చివరిగా చాక్లెట్ చిప్స్ ని కూడా దానికి చేర్చి.. బాగా కలుపుకోవాలి.
దీన్ని చిన్న చిన్న బిస్కెట్లుగా చేసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లను వేడి చేసుకోవాలి.
నీళ్లు వేడెక్కాక ఈ బిస్కెట్లను ఒక ప్లేట్ పై పెట్టి.. ఆ పాత్రలో ఉంచాలి.
ఒక 15 నిమిషాలు సిమ్ లోనే ఈ కుకీస్ ని ఉడికించాలి. అంతే రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంతో ఇష్టమైన బనానా ఓట్స్ చాక్లెట్ కుకీస్ రెడీ.