థైరాయిడ్ సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంది కొన్ని హెర్బల్టిలను తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
థైరాయిడ్ సమస్య నుంచి బయట పడాలంటే గ్రీన్ టీ అత్యుత్తమమైన మార్గంగా చెప్పవచ్చు గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫినోల్స్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి
లవంగం టీ లవంగాలను మంచినీటిలో మరిగించి ఆ నీటిని తాగినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది
అల్లం ముక్కలను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు ఇందులో హైపర్ థైరాయిడ్ సమస్యను తగ్గించే మూలకాలు ఉన్నాయి
అశ్వగంధ పొడిని గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది
గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగితే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు
మందార పువ్వులతో చేసిన హెర్బల్ టీ తాగితే మీరు థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది
దాల్చిన చెక్క టీ తో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం లభిస్తుంది
పుదీనా ఆకులను మరిగించి ఆ నీటిని తాగితే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం లభిస్తుంది
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.