మహిళల్లో సాధారణంగా పిసిఓఎస్ సమస్యల వల్ల సంతానలేమి, పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాలి.
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది పీసీఓఎస్ సమస్య నుంచి బయటపడినందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి.
స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీసీఓఎస్ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్గా ఆహారం తీసుకోవాలి.
ఆపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. పిసిఒఎస్ సమస్య నుంచి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
ద్రాక్ష పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇది పీసీఓఎఓస్ సమస్యను తగ్గిస్తుంది. మధుమేహం నుండి కాపాడుతుంది.
ఈ పండ్లలో విటమిన్లు A,C, అలాగే పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి పిసిఒఎస్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.
సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని పీసీఒఎస్ సమస్య నుంచి కాపాడుతుంది.
పైనాపిల్ పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది PCOS తగ్గించడానికి సహాయపడే ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేస్తుంది.
టమాటోలు PCOSను ఎదుర్కోవడానికి సహాయపడే కెరోటినాయిడ్ అయిన లైకోపీన్ ఉంటుంది. ఇది పలు సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
జామపండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీసీఓఎస్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.