మనలో చాలా మంది ఏ విషయం చెప్పినా ఇట్టే మర్చిపోతుంటారు. ఏ విషయమూ గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. మారుతున్న జీవనశైలి కారణంగా ఏదొక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.
చిన్న చిన్న వ్యాధులే పెద్ద వ్యాధులుగా మారుతుంటాయి. ముఖ్యంగా చిన్న వయస్సులోనే వ్యాధులు సంభవించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటారు.
జ్ఞాపకశక్తి అనేది పెద్ద సమస్యగా మారింది. చాలా మంది తరచూ అన్నీ విషయాలు మర్చిపోతుంటారు. మెదడు చురుగ్గా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పండ్లతో తయారు చేసిన జ్యూసులు తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతును్నారు. అయితే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జ్నాపకశక్తి పెంచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
రక్తంలో ఎర్ర రక్తకణాలు పెంచే దానిమ్మ రసం ఎంతో మేలు చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
నారింజ రసం తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. న్యూరోట్రాన్స్మిటర్ వంటి వాటిని పెంచేందుకు తోడ్పడుతుంది.
బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే మెదడుకు రక్తప్రసరణ పెంచి మెదడులోని కణాలకు పోషకాలు, ఆక్సిజన్ ను చేరవేస్తుంది.
ద్రాక్షరసంలో యాంటీఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. ఈ జ్యూస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.