కఫం, దగ్గు వేధిస్తోందా? ఈ గింజలు తింటే చాలు

Bhoomi
Oct 05,2024
';

కఫం, దగ్గు

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది దగ్గు, కఫంతో బాధపడుతుంటారు. ఛాతీలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దాం.

';

నల్ల ఏలకులు

వీటిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల ఏలకులు కాలానుగుణ సమస్యల నుంచి బయపటపడేలా చేస్తాయి.

';

దగ్గు, శ్లేష్మం

నల్లఏలకుల్లో ఉండే లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో శ్వాసనాళంలో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

ఎలా తినాలి?

మీరు దగ్గు సమస్యతో బాధపడుతుంటే నల్ల ఏలకులతో తయారు చేసిన టీ తాగవచ్చు. రెండు పెద్ద ఏలకులను తీసుకుని మెత్తగా నీటిలో వేసి మరిగించి తాగాలి.

';

ప్రతిరోజూ ఏలకుల టీ

ఏలకులు, టీ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఫిల్టర్ చేసి అందులో తేనే కలుపుకుని తాగవచ్చు. ఇలా రోజూ తాగితే కఫం కరుగుతుంది.

';

తేనెలో కలుపుకుని

శ్లేష్మం, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే తేనెలో నల్ల ఏలకులను కలుపుకుని తినవచ్చు.

';


పెద్ద ఏలకులను తీసుకుని గ్రైండ్ చేసి దాని పొడిలో తేనె కలుపుకుని తినాలి.

';


ప్రతిరోజూ రాత్రి తేనె, ఏలకుల మిశ్రమాన్ని తింటే దగ్గు, ముక్కు దిబ్బడ, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story