మెంతులలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఫైబర్, కాల్షియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
పాలలో కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది.
పాలలో మెంతుల పొడి కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది.
మెంతిపొడిని పాలలో కలిసి తాగితే శరీరంలో కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి.
మెంతిపొడిని పాలలో కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలలో మెంతిపౌడర్ కలిపి తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెంతిపాలు తాగితే తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. కొత్త తల్లులు తప్పనిసరిగా ఈ పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు.
మెంతిపాలు జీర్ణక్రియకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం, వాంతులు, విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.