తాగితే తల పట్టేసిందా? వీటితో నిమిషాల్లో హ్యాంగోవర్ మాయం
తాగిన తర్వాత ఒంట్లో శక్తినంతా కోల్పోయినట్టు కనిపిస్తుంది. వెంటనే నీరు తాగంగి. నీరు తాగితే శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. మద్యం సేవించడం వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ని పునరుద్ధరిస్తుంది.
హ్యాంగోవర్‌తో బాధపడుతుంటే వెంటనే అల్పాహారం చేయండి. టిఫిన్ చేస్తే ఒంట్లో శక్తి వచ్చి సమస్య తొలగుతుంది.
అజీర్తి, కడుపు నొప్పి ఉంటే వాటి నివారణకు అల్లం దోహదం చేస్తుంది. అల్లం చాయ్ తాగడం కానీ ఏదో రకంగా అల్లం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
హ్యాంగోవర్‌కు నిద్ర చక్కటి నివారణ. నిద్రపోతే మీ శరీరం అలసటను తొలగిస్తుంది.
హ్యాంగోవర్‌తో వాంతులు, అజీర్తి వస్తుంది. దీనిని తగ్గించడానికి పుదీనా ఆకులు ఉత్తమం. హ్యాంగోవర్ సమయాల్లో పుదీనా టీ తాగవచ్చు. లేదా పుదీనా ఆకులను తినవచ్చు.
హ్యాంగోవర్ సమయంలో విటమిన్ బీ, జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. హ్యాంగోవర్ తీవ్రత తగ్గుతుంది
హ్యాంగోవర్‌తో అలసటకు గురవుతారు. దానిమ్మ పండు రసం తాగితే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీటితో కూడా ప్రయోజనం ఉంటుంది.