టీ అనేది తాత్కాలికంగా ఉల్లాసాన్ని, తాజాదనాన్ని అందించినా దీర్ఘకాలంలో ఇది నష్టమే కల్గిస్తుంది. ఒక్క నెల టీ తాగడం మానేస్తే కలిగే 5 అద్భుతమైన మార్పులు చూద్దాం
ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం టీ మాత్రమే. చాలామంది రోజు ప్రారంభం టీతోనే చేస్తారు. టీ తాగకపోతే ఎదో కోల్పోయినట్టే ఉంటుంది
కానీ రోజూ టీ తాగే అలవాటు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
మీరు ఓ నెల రోజులు టీ పూర్తిగా మానేస్తే మీ శరీరంలో మీకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా ఈ మార్పులు గమనించవచ్చు
ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుది. ఓ నెలరోజులు టీ మానేస్తే మీ జీర్ణక్రియలో మెరుగుదల కన్పిస్తుంది.
టీలో ఉండే పంచదార, పాలు కారణంగా కేలరీలు పెరిగిపోతాయి. దాంతో బరువు పెరిగిపోతారు. అదే ఓ నెల రోజులు టీ తాగడం ఆపేస్తే క్రమంగా బరువు తగ్గడం గమనించవచ్చు
టీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర సరిగా పట్టదు. ఓ నెల రోజులు టీ తాగడం మానేస్తే రాత్రి వేళ మంచి నిద్ర పడుతుంది.
టీలో ఉండే కెఫీన్ కారణంగా ఆందోళన, టెన్షన్ పెరగవచ్చు. అందుకే ఓ నెల టీ తాగడం మాని చూస్తే ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.
టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఓ నెలరోజుకు టీ మానేస్తే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు క్రమంగా పెరుగుతాయి