వర్షాకాలంలో చాలామంది అల్లం టీ తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా ఎందుకో మీలో ఎవరికైనా తెలుసా

Md. Abdul Rehaman
Jul 01,2024
';


అల్లం అనేది ప్రతి భారతీయ కిచెన్‌లో లభ్యమయ్యే మసాలా పదార్ధం. అల్లంను కొన్ని రకాల వంటల్లోనూ, టీలోనూ వినియోగిస్తారు. అల్లం టీ తాగితే దగ్గు, జలుబు దూరమౌతాయి.

';

ఇమ్యూనిటీ బూస్ట్

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

ఒత్తిడి తగ్గించడం

అల్లం టీలో ప్రాకృతిక ఔషధ గుణాలున్నాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమౌతాయి.

';

జీర్ణక్రియ మెరుగుదల

అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ నుంచి ఉపశమనం కల్గిస్తుంది.

';

గొంతు గరగర

వర్షాకాలంలో గొంతు గరగర సమస్య ఎక్కువగా ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల గొంతు గరగర ఉంటే పోతుంది.

';

రక్త సరఫరా

అల్లం టీతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ , ఇతర పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

';

మైగ్రెయిన్ నుంచి ఉపశమనం

అల్లం టీ తాగితే తలనొప్పి, మైగ్రెయిన్ నొప్పి తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story