సొరకాయ పెసరపప్పు కూర..తిని ఉంటారు. కానీ ఎప్పుడన్నా సొరకాయ.. వేరుశనగపప్పు కూర.. తిన్నారా? తినకపోతే ఈ రెసిపీ మీకోసం
ముందుగా సొరకాయని.. పీల్ చేసుకుని.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
ఒక కడాయిలో నాలుగు స్పూన్ల.. నూనె వేడి చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి.
జీలకర్ర చిటపట అన్న.. తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి.. అందులో వేయండి.
ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసి.. రుచికి తగినంత ఉప్పు పసుపు వేస. ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి.
ఇంకొక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పును వేయించుకోవాలి.
వేరుశనగపప్పు చల్లారిన తర్వాత.. మిక్సీలో ఈ వేయించిన వేరుశనగ పప్పు.. ఒక పెద్ద వెల్లుల్లిపా.. ఒక ఏడు ఎండుమిరపకాయలు.. వేసి పౌడర్ చేసుకోండి.
సొరకాయలు బాగా మగ్గిన తర్వాత.. ఈ పౌడర్ ని అందులో కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి.
నూనె పైకి వచ్చేవరకు కూరను మగ్గనివ్వండి.. అంతే సొరకాయ వేరుశనగపప్పు కర్రీ రెడీ.