ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఆకుకూరలలో ఒకటి గోంగూర.
ఈ గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు.. చేకూరుస్తుంది అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
గోంగూర పచ్చడి, గోంగూర పప్పు.. ఇలా మనం గోంగూరతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు.
అయితే గోంగూర ఇలాంటి రుచికరమైన వంటకాలు చేసుకోవడానికి కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
గోంగూరలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో శరీరానికి కావాల్సిన..పోషకాలు అన్ని దక్కుతాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వీటి ద్వారా చెడు కొలెస్ట్రాల్..త్వరగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా ఈ గోంగూర పెంచుతుంది.