ప్రస్తుత తరం వారి తినే తిండి వల్ల.. గ్యాస్ ప్రాబ్లం చిన్న వయసు నుంచే వస్తోంది. ముఖ్యంగా గ్యాస్ వచ్చినప్పుడు ఎంతోమందికి గుండెల్లో లేదా కడుపులో మంటగా అనిపిస్తుంది.
అంత కాసేపు కూడా తట్టుకోలేకపోతుంటారు కొంతమంది. మరి గ్యాస్ కి తక్షణమే రిలీఫ్ తీసుకోరావాలి అంటే ఏమి చేయాలో చూద్దాం.
చాలామందికి తిన్న వెంటనే చమటలు పట్టడం.. కడుపులో చాలా వికారంగా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇవన్నీ కూడా గ్యాస్ వల్ల వచ్చేటివే. ఇందుకోసం వాము తీసుకోవడం ఎంతో మంచిది.
వామును వేయించి.. పొడి చేసుకుని..నెయ్యి కలిపి అన్నంతో తింటే తక్షణమే గ్యాస్ నుంచి బయటపడొచ్చు.
నిమ్మకాయ రసంలో ఈ వాము పొడి కలుపుకొని తాగినా కానీ.. పిల్లకి టేపులు వచ్చి వెంటనే గ్యాస్ అనేది బయటకు పోతుంది.
గోరువెచ్చని నీళ్లల్లో ఓ టీస్పూన్ తేనె కలుపుకొని తాగితే కూడా వెంటనే గ్యాస్ తగ్గుతుంది.