పాత రోజుల్లో ఆవు పాలు గేదె పాలతో పాటు చాలామంది మేకపాలు కూడా తాగేవారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మేక పాలు చంటి పిల్లలకు కూడా త్వరగా అరుగుతాయని తల్లిపాలకు బదులుగా మేకపాలు పట్టించడం చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం.
మేక పాలలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో వారికి మేకపాలు మంచి డైట్ అని చెప్పవచ్చు.
గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఆవుపాలతో సమానంగా మేకపాలను వాడుతుంటారు. మేకపాలలో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేకపాలు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేకపాలు మంచి ఆప్షన్.
మేక పాలలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించే ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి.
మేక పాలు ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వారికి చాలా బాగా పనిచేస్తాయి.
అజీర్ణ సమస్యలు ఉండే వారికి కూడా మేకపాలతో ఇబ్బంది ఉండదు. మేకపాలు చాలా పలుచగా ఉంటాయి. అందుకే వీటిని నిరభ్యంతరంగా తాగవచ్చు.
మేక పాలు రక్తపోటు సమస్యతో ఉన్నవారికి కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మేక పాలల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.