ఎన్ని టిఫిన్స్ ఉన్నా.. మన దక్షిణ భారత ప్రజలు ఎక్కువగా దోశ నే ఇష్టపడుతూ ఉంటారు. మరి రోజు రొటీన్ దోశ తిని బోర్ కొట్టి ఉంటే.. ఒకసారి ఈ క్రిస్పీ బ్రెడ్ దోస మహేష్ ట్రై చేయండి..
ముందుగా మూడు బ్రెడ్ ముక్కలను తీసుకొని.. ముక్కలుగా కట్ చేసుకుని.. ఒక మిక్సర్ జార్ లో వేసుకోండి.
దాన్ని బాగా గ్రైండ్ చేసి.. ఒక గిన్నెలో వేసుకొని.. తరువాత ఆ మిశ్రమంలో.. రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి.
అందులో రెండు స్పూన్ల బియ్యప్పిండి, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, రెండు చిన్న ముక్కలుగా వేసుకొని కలుపుకోండి.
అందులోనే 2 వెల్లుల్లి పాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను చిల్లీ ఫ్లెక్స్, ఒక స్పూను ఆర్గానో.. కొంచెం కొత్తిమీర..రుచికి తగినంత ఉప్పు వేసుకోండి.
అందులో అ కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుని పిండిని రెడీ చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి.
పెనం వేడి అయిన తర్వాత.. ఈ దోశ పిండిని వేసి మీడియం ఫ్లేమ్ లో దోశను.. కాలనివ్వాలి.. ఒక రెండు నిమిషాల తర్వాత.. క్రిస్పీగా ఉండే బ్రెడ్ దోస రెడీ