ఈమధ్య ఎక్కువగా తలనొప్పితో తరచుగా బాధపడడం మనం చూస్తూనే ఉన్నాం..
తరచుగా తలనొప్పితో బాధపడేవారు రోజూ బెల్లం, జీలకర్ర నీళ్లు తాగితే ఎంతో ఉత్తమం
ఇందులో ఉండే పోషకాలు తలనొప్పి నుండి చాలా త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి.
అంతేకాదు ఈ డ్రింక్ ఇతర అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.మరి ఈ డ్రింక్ తయారీ విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం
ముందుగా ఒక గిన్నెలో.. 2 కప్పుల నీటిని పోసుకొని స్టవ్ పైన పెట్టుకోండి.
ఆ నీళ్లలో ఒక చెంచా బెల్లం పొడి, ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించాలి.
ఈ నీళ్లను మరిగించి చల్లారిన తర్వాత తాగవచ్చు.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బెల్లం-జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.