స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి.
జీలకర్ర, ధనియాలు ,మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత కందిపప్పు, శనగపప్పు, కరివేపాకు ఒక పసుపు కొమ్ము కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఇవి చల్లారపడే వరకు పక్కన పెట్టుకోవాలి.
వీటన్నిటినీ కలిపి మెత్తగా పొడి కొట్టుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
మీరు రసం తయారు చేసుకునేటప్పుడు ఇప్పటినుంచి ఈ పొడిని వేసుకోండి
వేడివేడి అన్నంలో రసం వేసుకుని తింటే నాలుగు బుక్కలు ఎక్కువగా తింటారు..