మనం తినే ఆహారం, మన ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం కూడా మనం మంచి ఆహారం తీసుకోవాల్సిఉంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాక.. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా.. కొన్ని ఆహార పదార్థాలు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బెర్రీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ని నియంత్రిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తాయి.
డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తినే వారిలో గుండె ఆరోగ్యం బాగుంటుందని, గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.
సోయాబీన్స్ లో కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షించడానికి సోయాబీన్స్ బాగా ఉపయోగపడతాయి.
సోయాబీన్స్ లో మాత్రమే కాక సోయా పాలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
పాలకూర బ్రోకలీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెపోటు మరణించి రక్షిస్తుంది.