ప్రస్తుతం ఉన్న కాలుష్యానికి.. మన ఆహార అలవాట్లకి.. సగటు మనిషి ఆయుషు తగ్గుతూ వస్తోంది.. అన్నడంలో అతిశయోక్తి లేదు.. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే.. మన ఆయుష్షు పెరగడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు..
మరి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. ఆయుష్షు పెంచే ఆ చిన్న చిన్న చిట్కాలు ఏవో చూద్దాం..
రాత్రి నిద్రపోయే ముందు.. రోజు కనీసం అర గ్లాసు పాలైన తాగితే.. ఎసిడిటీ ఎప్పటికి మీ జోలికి రాదు.
రోజు గ్లాస్ నీళ్ళల్లో.. టీ స్పూన్ మెంతులు నానబెట్టి.. తాగితే.. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
భోజనం తరువాత సోంపు తినడం వల్ల.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఉదయం ఎక్కువగా.. మధ్యాహ్నం మితంగా.. రాత్రి చాలా తక్కువగా తినడం ఉత్తమం.
వీలైనంతవరకు బయట తిండిని దూరం పెట్టాలి. ముఖ్యంగా నూనె..చాలా తక్కువగా వాడాలి…