ఓట్స్ రోజు తిని బోర్ కొట్టిందా.. అయితే ఎంతో రుచికరంగా ఉండే ఓట్స్ కొబ్బరి లడ్లు ఎలా చేసుకోవాలో చూద్దామా..
ముందుగా ఒకటిన్నర కప్పు ఓట్స్ ని.. రోస్ట్ చేసుకోవాలి. తరువాత వాటిని.. ఒక మిక్సర్ జార్ లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయిన తర్వాత.. అందులోనే ఒక కప్పు బెల్లం తురుమును కూడా వేయండి.
ఒక స్పూన్ నెయ్యి.. ఒక చిన్న కప్పు నీరుని చేర్చి ఈ మిశ్రమం పాకం వచ్చేవరకు ఉంచుకోవాలి. కొంచెం పాకం వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఓట్స్ నీ కూడా అందులో వేయాలి.
తరువాత అర స్పూను యాలకుల పొడి.. వేసి ఈ మిశ్రమాన్ని పొడిగా వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు.. పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.
చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసి వాటిని లడ్డుల్లాగా.. చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బరువు తగ్గించే ఓట్స్ కోకోనట్ లడ్డు రెడీ