పూరి జగన్నాథ్ ఆలయం గురించిన సైన్స్ సహా ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు ఇవే..
పూరీ జగన్నాథ్ ఆలయం అంటనే రథయాత్ర గుర్తుకు వస్తుంది. ప్రపంచంలో లక్షలాది భక్తులు పాల్గొనే అతిగొప్ప కార్యక్రమం. అంతేకాదు చార్ ధామ్ తీర్ధయాత్ర స్థలాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియని ఆశ్యర్యపరిచే అంతు చిక్కని వాస్తవాలు ఏంటో ఓ లుక్క
పూరీ జగన్నాథ్ ఆలయ గోపురంపై ఉండే ధ్వజం గాలి వీచే దిశలో కాకుండా.. వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇది ఎవరికీ అంతు చిక్కని రహస్యం. అంతేకాదు ఆలయ పై భాగంలో ప్రతి రోజు కొత్త ధ్వజాన్ని ఆలయంలోని శిక్షణ పొందిన పూజారి మారుస్తారు.
ఏ కట్టడానికైనా.. దానికి సంబంధించిన నీడ కనిపిస్తుంది. కానీ పూరీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన నీడ ఏ దిశ నుంచి ఎక్కడ కనిపించకపోవడం విశేషం. ఆలయాన్ని నిర్మించిన శిల్పులు నైపుణ్యానికి ఇది నిదర్శనం. ఇది జగన్నాథుడి మాయ అని భక్తులు చెబుతుంటారు. ఈ రహాస్యాన్ని ఇప్ప
పూరీ జగన్నాథ్ ఆలయ గోపురంపై ఉండే సుదర్శన చక్రం ఎక్కడ నుంచి చూసినా.. ఎదురుగా చూసినట్టే కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన మరో అంతు చిక్కని రహస్యం ఇదే.
పూరీ జగన్నాథ్ దేవాలయం పై ఏ పక్షులు ఎగరవు. గుడి చుట్టుపక్కల అనేక పక్షులు కనిపిస్తున్నప్పటికీ గుడి పై భాగంలో ఏ పక్షి వచ్చి విశ్రాంతి తీసుకోవు. అసలు ఆలయ పై భాగంలో పక్షులనేవే కనిపించవు. ఇదో అంతు చిక్కని పూరీ జగన్నాథుడి మహిమ అని చెప్పాలి.
పూరీ జగన్నాథుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇక ప్రతి రోజు ఒక పద్ధతి ప్రకారం ప్రసాదాన్ని తయారు చేసి స్వామి వారికి నివేదిస్తారు. అంతేకాదు వచ్చిన ప్రతి భక్తుడికి ఆ ప్రసాదాన్ని అందజేయడం అనాదిగా వస్తుంది. ఏ రోజు కూడా అక్కడ స్వామి వారి ప్రసా
పూరీ జగన్నాథ్ ఆలయం సముద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ .. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన వెంటనే సాగర ఘోష శబ్దం వినబడదు. ఇది కూడా పూరీ జగన్నాథుడి మహిమా అని చెబుతారు.
పూరీ జగన్నాథ్ దేవాలయంలో ప్రతి రోజు కొత్త కుండలో ఒకదానిపై ఒకటి పేర్చి వండి వారుస్తారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. పైన ఉండే కుండలోని ఆహారం ముందుగా సిద్ధం అవుతుంది.
ఇక్కడ స్వయంగా మహా లక్ష్మి వచ్చిన వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ ప్రసాదానికి అంత రుచి అని చెబుతుంటారు. ఆ తర్వాత మిగిలిన కుండల్లో వంట పూర్తైవుతుంది.
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రానికి వ్యతిరేక దిశంలో గాలి వీచడం విశేషం. ఈ ఆలయాన్ని శ్రీ క్షేత్రం అని పిలుస్తారు.