Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మహిళల్లో ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వద్దు
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సాధారణంగా చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు
మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు కాస్త వేరేగా ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించాలి
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మహిళల్లో చాలా అశాంతిగా ఉంటుంది. ఛాతీలో కూడా నొప్పి ఉంటుంది.
పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు చేతులు, వీపు, మెడ, దవడల్లో నొప్పి ఉంటుంది.
చాలా సార్లు మహిళలకు కడుపు నొప్పి వస్తుంటుంది. కడుపులో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు
వాంతులు, వికారం, తల తిరగడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే జాగ్రత్త పడాలి
గుండె నొప్పి వచ్చే ముందు మహిళల్లో ఆందోళన, చల్లగా ఉన్నా సరే చెమట్లు పట్టడం జరుగుతుంది.
ఏ పనీ చేయకపోయినా తీవ్రమైన అలసట ఉంటుంది. ఛాతీలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇవి హార్ట్ ఎటాక్ లక్షణాలు కావచ్చు.