దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ముందుగా పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి చాలా మంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ ఉన్నారు. వీటికి బదులుగా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
బరువు తగ్గాలనుకునే వారు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.
బరువు తగ్గడానికి ప్రతి రోజు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఆహారాలను కేవలం డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఊబకాయాన్ని నియంత్రించుకోవడానికి తీసుకునే డైట్లో కేవలం ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలే తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువు తగ్గడానికి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండడానికి తప్పకుండా ఉదయాన్నే నిమ్మరసం, తేనె నీటిలో మిక్స్ చేసుకొని తాగాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని తినాల్సి ఉంటుంది.