పాముల్ని చూస్తే అందరికీ ఒణుకే. అంత ప్రమాదకరమైనవి. పాము కాటేస్తే ఎంత సేపట్లోగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇవ్వాలో తెలుసా

Md. Abdul Rehaman
Jul 18,2024
';


దేశవ్యాప్తంగా పాము కాటు మరణాలు పెరిగిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

';


దేశంలో వివిధ రకాల పాము జాతులు దాదాపుగా 400 ఉన్నాయి. ఇందులో 60 జాతుల పాములు అత్యంత విషపూరితమైనవి

';


అత్యంత విషపూరిత పాముల్లో రసెల్ వైపర్, ఇండియన్ కోబ్రా, ఇండియన్ కామన్ కరైత్, సా స్కెల్డ్ వైపర్ వంటివి మరీ ప్రమాదకరం

';


విషం లేని పాములు కాటేసినప్పుడు యాంటీ వీనమ్ ఇంజెక్షన్ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

';


కానీ విషపూరితమైన పాములు కాటేస్తే వెంటనే యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇవ్వాల్సిందే

';


కోబ్రా లేదా కరైత్ వంటి పాము కాటేస్తే కేవలం 40-45 నిమిషాల్లోకా యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

';


మరి కొన్ని కేసుల్లో 24 గంటల వరకూ యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇవ్వచ్చు

';


చాలా సందర్భాల్లో విషపూరితమైన పాము కాటేసిందా లేక విషం లేనిది కాటేసిందా అనేది తెలియకపోవచ్చు

';


అందుకే నాన్ పాయిజన్ కేసుల్లో కూడా యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇస్తుంటారు. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏదీ ఉండదు

';


పాము కాటేసిన తరువాత ఆ వ్యక్తికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఎంత డోసు ఇవ్వాలనేది ఆ వ్యక్తి కండీషన్ బట్టి ఉంటుంది

';

VIEW ALL

Read Next Story