Jonna Ambali or Jowar Ambali health benefits know the simple recipe of jonna ambali how to make it
జొన్న అంబలి అనేది మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
జొన్న అంబలి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు.
జొన్న అంబలి కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా రుచిలో కూడా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం ఇవాళే ట్రై చేయండి
జొన్న అంబలి తయారీకి 1 కప్పు జొన్న పండి, 2 కప్పుల పెరుగు, అర చెంచా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అవసరమౌతాయి
ఇంకా 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండు మిరపకాయలు కావాలి
ముందుగా ఓ గిన్నెలో జొన్న పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి ముద్దల్లేకుండా బాగా కలుపుకోవాలి
ఓ పాత్రలో నీళ్లు వేసి బాగా మరిగించాలి
ఇందులో కలిపి పెట్టిన జొన్న పిండి మిశ్రం వేసి బాగా కలపాలి.
ఫ్లేమ్ తగ్గించి 10 నిమిషాలు ఉడికించాలి.
జొన్న అంబలిని బాగా ఉడికిన తరువాత దించి చల్లార్చాలి
ఇందులో పెరుగు, ఉప్పు, జీరకర్ర పొడి వేసి కలపాలి.
ఓ చిన్న పాన్లో నెయ్యి వేడి చేసి అందులో కరివేపాకు, ఎండు మిరపకాయలతో తాలింపు వేసి అంబలిలో కలిపేయాలి
అత్యంత రుచి కరమైన, ఆరోగ్యకరమైన అంబలి తయారైనట్టే.