కాకరకాయ కేవలం కూర రూపంలో మాత్రమే కాదు నూనె రూపంలో కూడా అనేక ఔషధాలను కలిగి ఉంటుంది. కాకరకాయ గింజల నుంచి ఈ నూనెను సేకరిస్తారు. కాకరకాయ గింజల నూనె వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
కాకరకాయ నూనెను జుట్టు సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి బయటపడేందుకు కాకరకాయ నూనె వాడుతారు.
కాకరకాయ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ జుట్టు వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడతాయి.
కాకరకాయ నూనెలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈమె వెంట్రుకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.
కాకరకాయ నూనెను కొబ్బరి నూనెలో కలిపి తలకు మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో చుండ్రుని తొలగించే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
కాకరకాయ నూనె చర్మ సంబంధిత వ్యాధులను కూడా మిమ్మల్ని కాపాడుతుంది. కాకరకాయ నూనెతో మీ ముఖంపై మర్దన చేసుకుంటే మొటిమలు ఏర్పడవు.
కాకరకాయ నూనె వల్ల మీ శరీరంపై ఏర్పడ్డ నల్ల మచ్చలు కూడా తొలగించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వల్ల మీ చర్మం పారిపోకుండా ఉంటుంది.
కాకరకాయ నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫంగస్ బారిన మీ చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది.
కాకరకాయ నూనెను ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. తద్వారా డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది.
కాకరకాయ గింజలను నూనె మీ వెంట్రుకలు తెల్లబడకుండా కూడా కాపాడుతుంది. ఈ నూనెను కొన్ని చుక్కలు మీ తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడవు.