కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ కంటే ఎక్కువగా ఉండటంతో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కివిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
కివి పండుతో జీర్ణక్రియ కూడా మెరుగ్గా మారుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండే టీవీ డైట్ లో ఉంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అంతే కాదు రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రణంగా ఉంచుతుంది. అందుకే ఇది డయాబెటిస్ వారికి మంచిది.
చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
కివి పండు డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీ రోజు వారి ఆహారంలో కివి కచ్చితంగా ఉండాల్సిందే.
ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ స్థాయిలు పడిపోతాయి. అలాంటి సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల వ్యాధులతో పోరాడవచ్చు.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలు ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో కృషి చేస్తాయి అందుకే ఈ పండు మీ డైట్ లో ఉండాల్సిందే