చిలగడదుంపల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవ్వడమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతుంది.
చిలగడదుంపల్లో ఐరన్,ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప చేర్చుకుంటే రక్తహీనత వంటి సమస్యలు దూరమవుతాయి.
చిలగడ దుంపలు తినడం వల్ల.. చర్మం పై వచ్చే ముడతలు తొలగిపోతాయి.
చిలకడ దుంపలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. క్యాలరీలు కూడా చాలా తక్కువ. బరువు పెరగరు.
చిలగడదుంపలో ఉన్న కెరటోనాయిడ్స్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి ఫలితంగా డయాబెటిక్ పేషెంట్లు వీటిని తినవచ్చు.