పెళ్లికి ముందు ఒకే ఒక బ్లడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలంటున్నారు వైద్యులు..అదేంటో చూద్దామా
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా..అక్షయ్ కుమార్‌కు 56 పరీక్షలు చేయించిందట...కానీ అన్ని అవసరం లేదు. ఒకే ఒక్క పరీక్ష చాలు
కేవలం రెండే రెండు పరీక్షలు చేయించుకుంటే చాలంటున్నారు వైద్య నిపుణులు.
ఈ రెండు పరీక్షల్లో ఒకటి SGPT. ఇది ఒక లివర్ పరీక్ష. ఈ పరీక్ష కేవలం 20-25 రూపాయల్లోనే చేయించవచ్చు.
26 ఏళ్లు యువకుడికి ఈ పరీక్ష చేయించినప్పుడు అతని SGPT విలువ 80 ఉంటే..ప్రమాదం ముప్పు ఉన్నట్టే అర్ధం.
SGPT విలువ 80 ఉంటే 36 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి గుండె వ్యాధి ముప్పు ఉండవచ్చేనేందుకు 7 రెట్లు అవకాశాలున్నాయి.
26 ఏళ్లలో ఫిట్‌గా, హెల్తీగా ఉన్నాం..రోజూ జిమ్‌కు వెళ్తున్నాం మనకెందుకు గుండె సమస్య వస్తుందని అనుకోవచ్చు.
కానీ SGPT చేయించుకుంటే 80 తేలితే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. శరీరంలో ఇన్ఫ్లమేషన్కు ఇదొక కచ్చితమైన రిఫ్లెక్షన్. అందుకే ఈ ఒక్క పరీక్షతో ఆరోగ్యపరంగా ఆ యువకుడి భవిష్యత్ ఏంటో చెప్పేయవచ్చు.
SGPT అంటే Serum Glutamic Pyruvic Transaminase.హెల్తీ SGPT అంటే 7-56 ఉండవచ్చు. ఇది దాటితే ప్రమాదకర స్థాయిగా చెప్పవచ్చు.
SGPT ఎక్కువగా ఉదంటే లివర్ డ్యామేజ్‌ను కూడా సూచిస్తుంది. దీనికి కారమం కోలిసైప్టిటిస్, హెపటైటిస్, స్థూలకాయం, ఆల్కహాల్ , డ్రగ్స్ అలవాట్లు కావచ్చు.