బెండకాయను ప్రత్యేకించి డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తినడం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుందని.. శరీరానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
బెండకాయలలో విటమిన్-ఎ, సి,యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.
ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి దీర్ఘ కాళిక రోగాలను దరి చేరకుండా కాపాడతాయి.
బెండకాయలలో ఉండే పోషకాలు కండరాలు,నరాల పనితీరును మెరుగుపరిచి,దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి.
ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా లభించడం అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది .