క్యారెట్ ఇడ్లీలను ఉదయం అల్పాహారంలో భాగంగా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
';
క్యారెట్ లో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన లాభాలను అందిస్తాయి. కాబట్టి వీటిని రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు యోజనాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా క్యారెట్ తో తయారు చేసిన ఇడ్లీలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్కువ బరువుతో బాధపడుతున్న వారు తప్పకుండా అల్పాహారంలో భాగంగా తినండి.
';
ఈ ఇడ్లీలో ఉండే కొన్ని గుణాలు కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తాయి..
';
ఎప్పటినుంచో ఇంట్లోనే ఈ క్యారెట్ ఇడ్లీ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఎలాంటి శ్రమ లేకుండా ఇలా సులభంగా తయారు చేసుకోండి.
ముందుగా క్యారెట్ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి.. మినప పప్పును దాదాపు 5 గంటలకు పైగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
బాగా నానబెట్టుకున్న మినప పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఇడ్లీ రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
';
ఇక క్యారెట్ ముక్కలను తీసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరీలా తయారు చేసుకొని పిండి మిశ్రమంలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
';
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా, ఉప్పు వేసి వీటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత నాలుగు గంటల పాటు పిండిని పక్కన పెట్టుకోండి.
';
ఇలా పక్కన పెట్టుకున్న పిండిని ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులో ఫిల్ చేసి స్ట్రీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రీమైన ఇడ్లీలను ఇడ్లీ పాత్రల నుంచి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.