ప్రస్తుత కాలంలో పాలు అనగానే గుర్తొచ్చేది ప్యాకెట్ పాలు మాత్రమే. కానీ ఇప్పటికీ చాలామంది పిల్లలు వద్ద గేదె లేదా ఆవుపాలను తాగేందుకు ఇష్టపడతారు.
ప్యాకెట్ పాలతో సమానంగా కొంతమంది పాల ఉత్పత్తిదారులు.. నేరుగా గేదలు ఆవుల నుంచి పాలు పితికి కస్టమర్లకు ఇంటి వద్దనే పోస్తుంటారు.
కొంతమంది ప్యాకెట్ పాలను ఇష్టపడితే మరి కొంతమంది నేరుగా ఇంటి వద్ద లభించే గేదె లేదా ఆవుపాలను తాగేందుకు ఇష్టపడతారు.
ఈ రెండు రకాల పాలలో ఏవి సురక్షితమైనవి ఏవి? ఏవి తాగితే ఆరోగ్యవంతంగా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజానికి ప్యాకెట్లు లభించే పాలు పాశ్చరైజ్డ్ పాలు. అంటే వీటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పాలను సేకరించి వాటి నుంచి వెన్నను తీసి స్టాండర్డ్ మిల్క్ ను తయారుచేస్తారు.
ప్యాకెట్ పాలలో ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిని రెండు మూడు దశల్లో శుద్ధి చేస్తారు. అలాగే వీటి నుంచి వెన్నను సైతం తీస్తారు.
ప్యాకెట్ పాలలో వెన్న శాతాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. ఎవరైతే డైటింగ్ చేస్తారో వారు లో ఫాట్ మిల్క్ తాగుతారు. స్వీట్ల తయారీలో పాలను వాడేవారు హై ఫాట్ హోల్ మిల్క్ వాడొచ్చు.
ఇదిలా ఉంటే ఇళ్ల వద్ద నేరుగా పాలు పోసేవారు గేదెనుంచి ఆవుల నుంచి నేరుగా పాలను పితికి కస్టమర్లకు చేరవేస్తుంటారు.
అయితే ఈ విధంగా నేరుగా పోసే పాలను పాశ్చరైజ్ చేసే అవకాశం ఉండదు. ఈ పాలను గంటల వ్యవధిలోనే కస్టమర్కు చేర్చాల్సి ఉంటుంది. లేకపోతే పాలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
అయితే మీకు సమీపంలోనే పాల ఉత్పత్తి కేంద్రం ఉన్నట్లయితే.. పాలను నేరుగా పశువుల వద్ద నుంచే తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యవంతమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపారు.
ప్యాకెట్ పాలు కూడా సురక్షితమైనవే కానీ వీటిని నిర్ణీత తేదీలోపే వాడాల్సి ఉంటుంది. అలాగే నాణ్యమైన కంపెనీల వద్దే ప్యాకెట్ పాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.