మనం తులసి నీళ్లను ఎంతో పవిత్రంగా భావిస్తాము. అయితే ఈ తులసి నీళ్లు రోజు తాగడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆధ్యాత్మిక పరంగానే కాదు.. తులసికి ఆయుర్వేదంలో కూడా అరుదైన స్థానం ఉంది.
తులసి ఆకుల్లో యాంటీ ఏజింగ్ తత్వం కూడా ఉంటుంది. ఇది మనల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచేలా చూసుకుంటుంది.
తద్వారా శరీరం మెరిసిపోతూ.. ఎంతో కాంతివంతంగా కనిపిస్తాము.
అంతేకాదు తులసిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ డి లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
కాబట్టి రోజు తెలిసిన నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్యం మన సొంతం కావడంతో పాటు.. బరువు కూడా తగ్గవచ్చు.
ముఖ్యంగా చెక్కర వ్యాధితో బాధపడే వారికి తులసి ఔషధం. తులసి నీళ్లు రోజు తాగడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.