రోజు ఉదయాన్నే పసుపు నీళ్లు తాగడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నీళ్లలో పసుపు, సోంపూ, అల్లం ముక్క వేసుకొని నీరుని మరిగించి. చల్లరిన తర్వాత అందులో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఎంతో మంచిది
పసుపులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఇందువల్ల మన కడుపులోని బ్యాక్టీరియా తగ్గి జీర్ణ ప్రక్రియ బాగా పనిచేస్తుంది.
ఏ కాలంలో అయినా ఈ నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. తద్వారా దగ్గు, జలుబు నుంచి దూరంగా ఉండొచ్చు.
పసుపు ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని దూరం ఉంచుతుంది. అంతేకాదు ప్రతిరోజు చిటికెడు పసుపు తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతాము.
పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి పసుపుని తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యలు మన దరికి చేరవు.