జామ పండు తినడం ద్వారా..కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా డాక్టర్లు సైతం మనల్ని జామ పనులు తినండి అని చెబుతూ ఉంటారు.
డయాబెటిక్ పేషంట్స్ జామకాయలు తినడం ద్వారా షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.
జామపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ క్రియను బాగా పనిచేసేలా చేస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని పెంచి.. మొహం నిగనిగలాడేలా చెయ్యడంలో.. కూడా జామ పండు ఎంతో సహాయపడుతుంది.
జామ పండులో విటమిన్-సి అధికంగా ఉంటుంది. సాధారణంగా ఆకుకూరల్లో మనకు లభించే పీచు కంటే కూడా జామ పండులో రెండింతల పీచు లభిస్తుంది.
జామ పండులో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల.. ఈ పండు బరువు తగ్గదంలో సహాయపడుతుంది.